గురుగ్రామ్ లో ఓ మాజీ మోడల్ హత్యకు గురైంది. 27 ఏళ్ల ఈ మాడల్ ను మంగళవారం (జనవరి 2) రాత్రి కొందరు దుండగులు హత్య చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు నిర్దారించారు. హత్య కు గురైన యువతి మాజీ మోడల్, ఇటీవల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఓ గ్యాంగ్ స్టర్ ప్రియురాలిగా గుర్తించారు. గ్యాంగస్టర్ మరణం వెనక ఈ మోడల్ హస్తం ఉందన్న కారణంగా పథకం ప్రకారమే గ్యాంగ్ స్టర్ కుటుంబ సభ్యులు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
గురుగ్రామ్ లోని ఓ హోటల్ 27 యేళ్ల దివ్య పహుజా హత్య కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్, సహా ప్రకాష్, ఇంద్రరాజ్ లను అరెస్ట్ చేశారు. హోటల్ యజమాని అభిజిత్ తన సహజరులైన ప్రకాష్, ఇంద్రజ్ తో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని ఆపై దివ్య మృతదేహాన్ని పారవేసేందుకు బీఎండబ్ల్యూ కారులో తరలించారని తెలిపారు. హత్య కు సహకరించిన సహచరులకు రూ. 10 లక్షలు చెల్లించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
జనవరి 2(మంగళవారం ) ఈ హత్య జరిగింది. అభిజిత్, దివ్య, మరో వ్యక్తి కలిసి రూం నెం 111కి వెళ్లారని.. అదే రోజు రాత్రి హత్య జరిగిందని సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యింది. హత్య అనంతరం దివ్య మృతదేహాన్ని షీట్ లో చుట్టి బీఎండబ్ల్యూ కారులో వేరేచోటికి తరలించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
ఎవరీ దివ్య పహుజా..
మాజీ మోడల్ దివ్యపహుజా.. ఇటీవల ముంబై నకిలీ ఎన్ కౌంటర్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలి ప్రియురాలు. 20216 ఫిబ్రవరి 6న ముంబైలోని ఓ హోటల్ లో జరిగిన నకిలీ ఎన్ కౌంటర్ లో గాడోలీని హత్య చేసినట్లు దివ్య, ఆమె తల్లి, మరో ఐదుగురిపై పకేసు నమోదు అయ్యింది. పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి సందీప్ హత్యకు పథకం పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంది.
గ్యాంగ్ స్టర్ సందీప్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మోడల్ దివ్యకు 2023 జూన్ లో బెయిల్ వచ్చింది. అయితే గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్ లు అభిజిత్ సింగ్ తో కలిసి దివ్య ను హత్య చేసినట్లు దివ్య కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. హోటల్ యజమానిపై కూడా ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.