మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ( సెప్టెంబర్ 25, 2024 ) ఉదయం గం. 06:15 లకు మరణించారు. ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్వతమ్మకు మరిది. మాగుంట పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభిమానులు, పలువురు నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయిన ఐదు నెలల్లోనే పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.