
కరోనాతో మాజీ ఎంపీ, నంది ఎల్లయ్య మృతిచెందారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఎల్లయ్య జూలై 29న కరోనాతో నిమ్స్ లో చేరారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నఆయన.. ఈ రోజు తీవ్ర అనారోగ్యం బారినపడి కన్నుమూశారు. ఆయన ఒకసారి నాగర్ కర్పూల్ నుంచి, ఐదుసార్లు సిద్ధిపేట నుంచి మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా 1979-84, 1989-97 కాలంలో రాజ్యసభకు కూడా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు నాగర్ కర్నూల్ నుంచి లోకసభకకు ఎన్నికయ్యారు.
For More News..