పొన్నం పాదయాత్రకు కేకే మహేందర్ రెడ్డి దూరం

పొన్నం పాదయాత్రకు కేకే మహేందర్ రెడ్డి దూరం

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర రెండో రోజు సాగింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం 16 కిలోమీటర్లు సాగి సిరిసిల్ల మండలంలోకి ఎంటరయ్యింది. పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలలో, 38 మండలాలు,7 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ లో పాదయాత్ర 18 వరకు కొనసాగనుంది. 

కేకే మహేందర్ రెడ్డి దూరం

సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్​ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి..పొన్నం పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు. యాత్రకు తనను ఆహ్వానించలేదని అందుకే దూరంగా ఉన్నట్లు ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.