కేసీఆర్ కంటే తాను సీనియర్ పొలిటీషియన్ ను అని..తన రాజకీయ జీవితాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. తెలంగాణలో భూ, డ్రగ్, మద్యం, ఇసుక మాఫియాపై గవర్నర్ తమిళి సైని కలిసి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 30 లక్షల కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని కోరారు. సచివాలయం, కాళేశ్వరం, ప్రగతి భవన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
విచారణ జరిపించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలంటూ గవర్నర్ ను కోరామన్నారు. ఐదవ షెడ్యూల్ లోని అధికారాలను వాడుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. కులాల మధ్య, తెగల మధ్య కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఎంపీ సోయం బాపూ రావుతో సీఎం కేసీఅరే వ్యాఖ్యలు చేయించారని విమర్శించారు.