తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబువి ఆధారాలు లేని ఆరోపణలు : మాజీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. చంద్రబాబువి ఆధారాలు లేని ఆరోపణలు : మాజీ ఎంపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయవర్గాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులను, హిందువులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యస్వామి.

Also Read:-ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ

మొత్తానికి వైసీపీని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఈ అంశంపై సీబీఐ విచారణ కోరుతూ దేశవ్యాప్తంగా వాదనలు వినిపిస్తున్న క్రమంలో మునుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఆసక్తి సర్వత్రా నెలకొంది.