మాజీ జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చినట్లుగా చెబుతున్న బోయినపల్లి సరితకు తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కావాలనే దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ జెన్‌కో సంస్థలో బోయినపల్లి సరిత అనే మహిళను అసిస్టెంట్ ఇంజినీర్ గా నియమించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వినోద్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటిపేరు ఒకటి అయితే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నవి కాబట్టే నాపై చీఫ్ ట్రిక్స్ తో ప్రచారం చేస్తున్నారని వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. ఒక వార్త పబ్లిష్ చేసేముందు సమగ్ర సమాచారం తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇరవై ఏండ్ల రాజకీయంలో తాను ఏనాడు తప్పును ప్రొత్సహించలేదని.. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పనన్నారు. బండిసంజయ్ తనపై బిజేపి కార్యకర్తలతో దుష్ప్రాచారం చేస్తున్నారని... గోబెల్స్ ప్రచారం అపాలన్నారు. ఆ అమ్మాయి తన బంధువు అని రుజువు చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు.