వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ జట్టు పాల్గొంటుందా! లేదా అన్నది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేతిలో ఆ జట్టు.. వరల్డ్ కప్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఒకవైపు ఈ వివాదం ఇలా ఉంటే.. మరోవైపు మాజీ ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమ జట్టే గెలుస్తుందంటూ ఎవరకి వారు గంభీరాలు పలుకుతున్నారు. ఇలాంటి సమయాన పాక్ మాజీ ఆటగాడు రాణా నవీద్ ఉల్ హసన్.. భారత ముస్లింలను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏ దేశ ప్రజలు.. ఆ దేశానికే మద్దతివ్వడం, తమ దేశమే గెలవాలని కోరుకోవడం సహజం. ఇది అన్ని క్రీడల్లోనూ ఒకేలా ఉంటుంది. మనదేశంలోనూ అదే జరుగుతుంది. కానీ పాక్ క్రికెటర్ రాణా నవీద్ ఉల్ హసన్ అందుకు భిన్నంగా వ్యాఖ్యానించటం గమనార్హం. నాదిర్ అలీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నవీద్ ఉల్ హసన్.. భారత్‌లో ఉన్న ముస్లింలు పాకిస్తాన్ కు మద్దతిస్తారు అంటూ పిచ్చి కూతలు కుశారు.
'ఇండియాలో మ్యాచ్ జరిగితే మేం సిక్సర్ కొట్టినా, ఫోర్ కొట్టినా.. ఆఖరికి మ్యాచ్ గెలిచినా.. ఎవ్వరూ చప్పట్లు కొట్టరు, ఏ మాత్రం సపోర్ట్ ఉండదు.." అని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ మాట్లాడిన కొన్ని గంటలకే రాణా నవీద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత్‌లో మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా టీమిండియానే ఫెవరెట్. అందులో సందేహం లేదు. అయితే భారత్‌లో పాకిస్థాన్ తో మ్యాచ్ జరిగితే భారత ముస్లింలు వారి దేశానికి బదులు పాకిస్థాన్‌కు మద్దతిస్తున్నారు. మేం అక్కడ ఇండియన్ క్రికెట్ లీగ్ ఆడాం. ఇంజమామ్ భాయ్ కెప్టెన్‌గా ఉన్నాడు. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగినప్పుడు మాకు చాలా మద్దతు లభించింది. ఇప్పుడున్న అన్ని క్రికెట్ జట్లలో మాదే స్ట్రాంగ్ టీమ్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్ ఉంటుంది.." అని నవీద్ ఉల్ హసన్ మాట్లాడారు.
కాగా, అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల(ఇండియా vs పాకిస్తాన్) పోరు జరగనుంది.