ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పదవులకే వన్నె తెచ్చిన మన్మోహన్

ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా పదవులకే వన్నె తెచ్చిన మన్మోహన్

మాజీ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మన్మోహన్ మృతి పట్ల యావత్తు దేశం దిగ్భ్రాంతికి గురైంది. 33 ఏళ్ల క్రితం 1991లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం పీవీ నరసింహరావు కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం  తిప్పిన మన్మోహన్ సింగ్.. రెండు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయంలో 1991నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో  ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తన వ్యూహచతురతో గాడిన పెట్టారు. ఐదుసార్లు రాజ్య సభ్యుడిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. 1987లో భారత ప్రతిష్టాత్మక అవార్డు పద్మ విభూషన్ అందుకున్నారు.  

ALSO READ | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

క్లిష్టమైన పరిస్థితుల మధ్య యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలకు సారథ్యం వహించారు. ఆయన ఆర్థిక విధానాలు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. ప్రధాని కాకముందు 1991 జూన్ లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన హయాంలో గణనీయమైన జీడీపీ వృద్ధిరేటు నమోదుకాగా.. దేశంలో పేదరికం తగ్గుముఖంపట్టింది.

మన్మోహన్ సింగ్ జీవితం.. వివరాలు:

  • మన్మోహన్ సింగ్ జీవితం.. వివరాలు:
  • మన్మోహన్ పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)  ‘మా’ ప్రాంతంలో 26 సెప్టెంబరు 1932  జన్మించారు.
  • 1958, సెప్టెంబరు 14 న  వివాహం జరిగింది. 
  •  కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమృత్
  • పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా 
  •  పంజాబ్ యూనివర్సిటీలో బీఏ, ఎంఏలో టాపర్ గా నిలిచారు. అనంతరం కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో మన్మోహన్ సింగ్ డీ ఫిల్ చేశారు. 
  •  కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్   ఆక్స్ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)  అదే విధంగా హోనరిస్ కాసా నుంచి డి.లిట్ సంపాదించారు.  
  • 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన ఆయన 1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
  • మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.2శాతం) వృద్ధిరేటు నమోదైంది. 
  • మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. 
  • మన్మోహన్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం1987లో  పద్మవిభూషణ్ ప్రదానం చేసి సత్కరించింది.