కోలుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ

కోలుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ

మాజీ ప్రెసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీ ఆగష్టు 10న కరోనాతో ఆర్మీ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ రిఫరల్‌ హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయ్యారు. అప్పటినుంచి ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆ రోజు నుంచి మంగళవారం వరకు ఆయన ఆరోగ్యంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దాంతో వైద్యులు, ఆయన కుటుంబసభ్యులు కొంత ఆందోళన పడ్డారు. కాగా.. బుధవారం ఉదయం ఆయన ఆరోగ్యంలో మార్పు కనిపించింది. డాక్టర్ల కృషితో ఆయన ఆరోగ్యం నియంత్రణలోకి వచ్చింది. మెల్లగా ఆయన కోలుకుంటున్నట్లు కనిపించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘మీ అందరి ఆశీస్సులు మరియు డాక్టర్ల కృషితో నా తండ్రి కోలుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మీ అందరూ ప్రార్థించాలని అభ్యర్థిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

‘గ్రాడ్యుయేట్ల ’పై గురిపెడుతున్న నేతలు

ఇష్టం లేని పెండ్లి చేశారని భార్యను చంపిండు

సిటీలో కరోనాను లైట్ తీసుకుంటున్నరు