- పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్
- హైదరాబాద్‌కు పోరుబాట.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని మాజీ సర్పంచ్‌లు పోరుబాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్ బయలుదేరగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా, పలువురు మాజీ సర్పంచ్‌లు హైదరాబాద్ కు చేరుకొని, ఓ హోటల్లో సమావేశమయ్యారు. అనంతరం హోటల్బయటకు వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ మద్దతు
మాజీ సర్పంచ్ల పోరుబాటకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. మాజీ సర్పంచ్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు.. తిరుమలగిరి రోడ్డుపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి, నిరసన తెలిపారు.