ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. రేణిగుంటలో వైసీపీ శ్రేణులు చీరలు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు.రాజీనామా చేసిన వాలంటీర్లతో చీరల పంపిణీ చేయిస్తుండటం ఇక్కడ మరొక ట్విస్ట్. విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకోగా అధికారులను చూసిన మాజీ వాలంటీర్లు పరార్ అయ్యారు.
అధికార వైసీపీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కేసుల గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సెన్సిటివ్ ఏరియాస్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.