ఆశా వర్కర్లకు ఎగ్జామ్ ను రద్దు చేయాలి

ఆశా వర్కర్లకు ఎగ్జామ్ ను రద్దు చేయాలి

కొల్లాపూర్, వెలుగు: ఆశా వర్కర్లకు ఎగ్జామ్  పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి ఈశ్వర్​ డిమాండ్​ చేశారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని పీహెచ్​సీలో శనివారం ఆశా వర్కర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏండ్ల నుంచి పని చేస్తున్న ఆశా వర్కర్లకు వివిధ రకాల ట్రైనింగ్​ ఇచ్చారని, రిజిస్టర్లు రాయడం, సర్వేలు చేయడం, ఆన్​లైన్ చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్  వంటి రోగాలను గుర్తిస్తున్నారని తెలిపారు. 

అన్నివర్గాల ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు ఎగ్జామ్​ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్స్  యూనియన్  జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, శివలీల, మమత, జ్యోతి, సునీత, భీమమ్మ, ప్రసన్న, వెంకటమ్మ పాల్గొన్నారు.