
న్యూఢిల్లీ: పరీక్షలపై స్టూడెంట్లలో భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న ఢిల్లీలోని భారత మండపం టౌన్హాల్లో జరగనుంది. అయితే, ఈ ఏడాది పీపీసీ- 2025ను కొత్త ఫార్మాట్లో తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, ఎక్స్పర్ట్స్పాల్గొననున్నారు. పీపీసీ- 2025 ఎనిమిదో ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్, బాలీవుడ్ నటీ, దీపికా పదుకొనె తదితరులు పాల్గొననున్నారు.