
కోలబెల్ట్, వెలుగు : మందమర్రి ఏరియాలో ఇంటర్నల్ సర్వే మజ్దూర్ల నుంచి అసిస్టెంట్ చైన్మెన్ ప్రమోషన్ల కోసం అర్హులైన ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. గురువారం మందమర్రి సింగరేణి జీఎం ఆఫీసులో ఈ పరీక్షలు జరిగాయి. 13 పోస్టులకు 21 మంది ఉద్యోగులు హాజరయ్యారు. చైన్మెన్ నుంచి హెడ్ చైన్మెన్ ప్రమోషన్ పోస్టులు ఐదింటికి ఇద్దరు పోటీ పడ్డారు. పరీక్షలను ఏరియా సింగరేణి అధికారులు పర్యవేక్షించారు.