సొంత జిల్లాల్లో పీజీ లాస్ట్ సెమ్ ఎగ్జామ్ సెంటర్లు
అన్ని వర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందం
స్టూడెంట్స్‌కు ఇబ్బందులు రాకుండా నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని పీజీ చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్లకు యూనివర్సిటీలు శుభవార్త చెప్పాయి. సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించాయి. కరోనా ఎఫెక్ట్‌తో సొంతూర్లకు పోయిన స్టూడెంట్స్ వాళ్లు చదువుతున్న ప్రాంతాల్లో పరీక్షలు రాయడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఆరు వర్సిటీల పరిధిలో..
రాష్ట్రంలోని 6 సంప్రదాయ వర్సిటీల పరిధిలో పీజీ కన్వెన్షనల్ కోర్సులు చదువుతున్న చివరి సెమ్ స్టూడెంట్లు 25 వేల మంది ఉన్నారు. వీళ్లకు పరీక్షల పెట్టడానికి ఇప్పటికే వర్సిటీల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 19 నుంచి ఓయూ పరిధిలోని స్టూడెంట్స్‌కు పరీక్షలు మొదలు కానున్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలో ఈ నెల 8 నుంచి స్టార్ట్కావాల్సి ఉన్నా వాయిదా పడ్డాయి. మిగిలిన వర్సిటీల పరిధిలోని ఎగ్జామ్స్ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే స్టూడెంట్లంతా సొంతూర్లకు వెళ్లారు. అక్కడే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కరోనా వల్ల హాస్టళ్లు ఇప్పట్లో స్టార్టయ్యే పరిస్థితి లేదు. దూరప్రాంతాల్లోని స్టూడెంట్లకు పరీక్షలు రాయడం ఇబ్బందిగా మారింది. దీంతో ఓయూ, కేయూ అధికారులు మిగిలిన వర్సిటీలతో మాట్లాడి ఎక్కడివాళ్లను అక్కడ పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.
ఓయూ చరిత్రలో మొదటిసారి
ఓయూ చరిత్రలో తొలిసారి వర్సిటీ పరిధి దాటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 9 వేలకు పైగా స్టూడెంట్స్ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓయూ పరిధిలో ఏటా 80 సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా ఈసారి కొత్తగా మరో 6 సెంటర్లను పెంచారు. అలాగే వేరే వర్సిటీల పరిధిలో 12 కేంద్రాలను కూడా ఎంపిక చేశారు. వరంగల్, ఖమ్మం, నిర్మల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్గొండ, కోదాడ, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డిల్లో కేంద్రాలు పెట్టారు. కరోనా వల్ల ఎవరి జిల్లాలో వారు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించినట్టు ఓయూ పరీక్షల విభాగం ఇన్చార్జ్ శ్రీరామ్తెలిపారు.
రెండ్రోజులు ఎగ్జామ్స్ బంద్
కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రకటన
భారీ వర్షాలు, వరదల కారణంగా బుధ, గురువారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. శుక్రవారం నుంచి పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. బుధ, గురువారాల్లో జరగాల్సిన ఎండీ హోమియో, యునాని, ఎంపీహెచ్ సెకండ్ ఇయర్, ఎమ్మెస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ సహా పలు కోర్సుల పరీక్షలు వాయిదా పడ్డాయి.
For More News..