గుప్త నిధుల కోసం అర్థరాత్రి గుడి ముందు తవ్వకాలు

గుప్త నిధుల కోసం అర్థరాత్రి గుడి ముందు తవ్వకాలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. రుద్రాక్షపల్లి గ్రామ శివారులో పురాతన ఆలయం అయిన హనుమంతుని గుడి ప్రాంగణంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడి పుట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం  తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు ఆనవాళ్లను గుర్తించారు. 

నాగేంద్ర స్వామి ఆలయం పక్కనే ఉన్న పుట్ట వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఆటోలో వచ్చి తవ్వకాలు చేపట్టి తిరిగి గుంతను పూడ్చివేశారు.తర్వాత రోజు ఆలయం వైపుగా వచ్చిన భక్తులు,రైతులు పుట్ట దగ్గర తవ్వకాలు చేసినట్లుగా గుర్తించారు.అయితే గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారా లేక ఇంకా ఏదైనా జరిగిందా అనే దానిపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. స్థానికులు సహాయంతోనే గుప్తనిధుల కోసం ఈ తవ్వకాలు జరిగి ఉంటాయనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.