రంగారెడ్డి జిల్లాలో గుప్త నిధుల కలకలం రేగింది. శంషాబాద్ మండలం తొండపల్లి గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్ లోపల గుర్తు తెలియని బుధవారం(జనవరి 03) వ్యక్తులు తవ్వకాలు జరిపారు. దాదాపు 20 ఫీట్ల వరకు సొరంగం తవ్వి.. అక్కడ టెంకాయలు, నిమ్మకాయలు, అగరవత్తులు పెట్టి పూజలు చేశారని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.