చండ్రుగొండలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

చండ్రుగొండలో గుప్తనిధుల కోసం తవ్వకాలు

జూలూరుపాడు, వెలుగు :  చండ్రుగొండలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చండ్రుగొండ పంచాయతీ శివారు ఇమ్మడి రామయ్యబంజర గ్రామం సమీపంలోని జామాయిల్​ తోటలో శుక్రవారం తెల్లవారుజామున తొమ్మిది మంది వ్యక్తులు గుప్తనిధుల కోసం, మంత్రగాళ్ల సాయంతో పూజలు, తవ్వకాలు చేశారు. 

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై జి. స్వస్న సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి గుప్తనిధులు తవ్వుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది అడుగుల గోతిని తవ్వినట్లు గుర్తించారు. నిందితులను పోలీస్​స్టేషన్​కు తరలించి విచారిస్తున్నారు.