మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు

జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన వేలాల గట్టు మల్లన్న దొనలో రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టపై ఉన్న గట్టు మల్లన్నస్వామి  దొనలో శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఏటా శివరాత్రి మినహా దొనవైపు భక్తులు అరుదుగా వెలుతుంటారు. ఇదే అదునుగా దుండుగులు తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జైపూర్ ఎస్ఐ శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యులు ద్వారా సమాచారం అందినట్లు తెలిపారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామన్నారు.