ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు... ఎక్కడ సరిపోవేమోనని చాలా చపాతీలు చేస్తారు. కానీ సరిగ్గా తినకపోవడం వల్ల కొన్ని తెల్లారికి మిగులుతాయి. అప్పుడు వాటిని కేవలం పడేయడం ఇష్టం లేక తింటారు చాలామంది. కానీ ఆ మిగిలిన చపాతీలతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. అవునా! అని ఆశ్చర్యపోతున్నారా? ఇంట్లో ఎప్పుడు చపాతీలు ఎలాంటి వంటకాలు తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. . .
చపాతి నూడుల్స్ తయారీకి కావాల్సినవి
- చపాతీలు ...ఐదు
- వెల్లుల్లి తరుగు - ...ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు -... ఒక టీస్పూన్
- ఉల్లిగడ్డ తరుగు... పావు కప్పు
- ఉల్లికాడ తరుగు - ...నాలుగు టేబుల్ స్పూన్లు
- క్యారెట్ తురుము ...- పావు కప్పు
- క్యాబేజీ తరుగు... - పావు కప్పు
- క్యాప్సికమ్ తరుగు.. - రెండు టేబుల్ స్పూన్లు
- టొమాటో సాస్ -...రెండు టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తరుగు - ...ఒక టేబుల్ స్పూన్
- వెనిగర్... - ఒక టేబుల్ స్పూన్
- సోయా సాస్-... ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు... - తగినంత
తయారీ విధానం: చపాతీలను సూడుల్స్ లా సన్నగా కట్ చేయాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ. ఉల్లికాడ తరుగు వేసి కలపాలి. ఆపైన క్యారెట్ తురుము, క్యాబేజీ, క్యాప్సికమ్ తరుగు వేయాలి. వేసిన కూరగాయలన్నీ మగ్గాక టొమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చపాతీ నూడుల్స్, కొత్తిమీద తరుగు వేయాలి. రెండు నిమిషాలయ్యాక స్టవ్ ఆపేసి సర్వ్ చేయాలి.
చపాతి చిప్స్ తయారీకి కావలసినవి
- చపాతీలు... - మూడు
- నూనె -... తగినంత
- చాట్ మసాలా...- అర టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందురోజు మిగిలిన చపాతీలను వచ్చిన ఆకారంలో బిళ్లలుగా కట్ చేయాలి. వాటిని నూనెలో దీప్ ఫ్రై చేయాలి. తర్వాత వాటిని ఒక వెడల్పాటి ప్లేట్ లో పరిచి చాట్ మసాలా చల్లాలి. ఇలా కరకరలాడే చపాతీ చిప్స్‌ను ఏదైనా చట్నీ సాస్ తో నంజుకుంటే అద్భుతంగా ఉంటాయి. లేదంటే చపాతీ ముక్క లకు నూనె రాసి ఒవెన్లోనూ బ్రెడ్ చేసుకోవచ్చు.
చపాతి లడ్డు తయారీకి కావాల్సినవి
- ముందు రోజు మిగిలిన చపాతీలు ...నాలుగు(పెద్దవి)
- బెల్లం తురుము...- అర కప్పు
- సోంపు -....ఒక టీస్పూన్
- ఇలాచీ పొడి... - అర టీ స్పూన్
- నెయ్యి.... - మూడు టేబుల్ స్పూన్స్
- డ్రై ఫ్రూట్స్ ..కిస్ మిస్, బాదం, జీడిపప్పు తరుగు - ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)
తయారీ విధానం : చపాతీలను ముక్కలుగా తుంచి మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ పొడిని గిన్నెలో వేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. ఇందులో బెల్లం తురుము వేసి పాకం పట్టాలి. తీగ పాకం కాకముందే ఇలాచి పొడి, వేగించిన డ్రై ఫ్రూట్స్ తరుగు, చపాతీలను పొడి చేసి కలపాలి. చిన్న మంటపై రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి. మిశ్రమం గట్టి పడ్డాక స్టవ్ ఆవేసి చల్లార్చాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని గుండ్రంగా ముద్దలు కట్టాలి. ఇలా చేస్తే పిల్లలే కాదు... పెద్దలు కూడా ఇష్టంగా ఉంటారు
చపాతి కట్లెట్ తయారీకి కావాల్సినవి
- చపాతీలు... నాలుగు
- ఉడికించి మెదిపిన ఆలుగడ్డ...-రెండు కప్పులు
- పచ్చిమిర్చి తరుగు - ...రెండు టీస్పూన్లు
- క్యారెట్ తురుము ...- ఒక కప్పు
- ఉడికించిన స్వీట్ కార్న్... - అర కప్పు (కావాలంటే)
- ఉల్లిగడ్డ తరుగు..ఒక కప్పు
- కారం - ...ఒక టీ స్పూన్
- ఉప్పు - ...తగినంత
- ఆమ్ చూర్ పొడి... - అర టేబుల్ స్పూన్
- మిరియాల పొడి....- అర టేబుల్ స్పూన్
- నిమ్మరసం.... - ఒక టేబుల్ స్పూన్
- ఎండిన బ్రెడ్ పొడి- ...ఒక కప్పు
- కార్న్ ఫ్లోర్.... - ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: రాత్రి మిగిలిన చపాతీలను మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిగడ్డ తరుగు... పచ్చిమిర్చి తరుగు.... క్యారెట్ తురుము చేసి నిమిషంపాటు వేగించాలి. తర్వాత స్వీటీ కార్న్ గింజలు, ఆలుగడ్డ వేసి అర నిమిషం మగ్గించాలి. ఆపైన మిరియాల పొడి, ఆమ్ మార్ పొడి, కారం వేసి కలపాలి తర్వాత పెద్దగిన్నెలో చపాతీల పొడి, ఆలుగడ్డ మిశ్రమం.... నిమ్మరసం.... ఉప్పు... పోపు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని, కట్ లెట్ ఆకారంలో వత్తాలి. ఇంకోవైపు కార్న్ ఫ్లోర్ లో సరిషడా నీళ్లు పోసి కొంత జారుగా కలపాలి. కట్ లెట్లను పిండిలో ముంచి, ఎండిన బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.. వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని ఏదైనా చట్నీ లేదా పెరుగుతో సర్వ్ చేసుకోవాలి