ఇలా కూడా పగతీర్చుకుంటారా: కొడుకుపై కోపంతో..షాపులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన తండ్రి

ఇలా కూడా పగతీర్చుకుంటారా: కొడుకుపై కోపంతో..షాపులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన తండ్రి

కుటుంబ కలహాలు.. రోడ్డుకీడ్చాయి...కన్న కొడుకు అని చూడకుండా కటకటాల పాలు చేయాలనుకున్నాడు ఆ తండ్రి..పక్కా స్కెచ్ గీశాడు.. తన ఫ్రెండ్స్ తో కలిసి కొడుకును దోషిగా నిరూపించేందుకు సిద్దమయ్యాడు.. అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేశాడు కొడుకుకు జైలు పంపించాడు.. అయితే ఆ తండ్రి మోసం ఎంతో దాగలేదు..విచారణ సమయంలో పోలీస్ అతడి బండారం బయటపడింది. కుటుంబ తగాదాలతో కొడుకు జైలుకు పంపించిన తండ్రి.. అదే జైలు ఊచలు లెక్కిస్తున్న ఘటన కేరళలో జరిగింది..వివరాల్లోకి వెళితే.. 

కేరళలోని చెట్టాప్పలమ్ కు చెందిన అబుబాకర్ ను స్థానిక పోలీసులు శుక్రవారం ( డిసెంబర్ 20) అరెస్ట్ చేశారు. తన కొడుకు అయిన నౌఫుల్ షాపులో గంజాయి పెట్టి అతడిని జైలు పంపిన ఆరోపణలతో పోలీసులు అబుబాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.  

అబుబాకర్, అతని కొడుకు నౌఫుల్ కు మధ్య గత కొంతకాలంగా గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో ఎలాగైన తన కొడుకు నౌఫుల్ ను ఇరకాటంలో పెట్టాలని.. జైలుకు పంపించాలని ప్లాన్ వేశాడు. అబుబాకర్.. అనుకున్న ప్లాన్ ప్రకారం.. తన స్నేహితులైన ఆటో డ్రైవర్ జిన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఔతా కలిసి గంజాయి కేసులో ఇరికించారు. 

ప్లాన్ ప్రకారం.. సెప్టెంబర్ 6న పీఏ బనానా ఏజెన్సీలపై ఎక్సైజ్ బృందం దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బస్తాల మధ్య గంజాయిని దాచారు. షాపు యజమాని పీఏ నౌఫల్‌పై మొదట పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే మసీదులో మధ్యాహ్న ప్రార్థనల కోసం నౌఫల్ వెళ్లిన సమయంలో దుకాణంలో నిషిద్ధ వస్తువులు అమర్చినట్లు విచారణలో తేలింది.

సీసీఫుటేజీ పరిశీలించిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. అబుబాకర్ స్నేహితుడైన జీన్సే బస్తాలో గంజాయి తెచ్చి నౌఫుల్స్ షాపులో ఉంచినట్లు తేలింది. కొడుకుపై పగతో రగిలిపోతున్న అబూబాకర్ డైరెక్షన్ లో ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. 

అబూబాకర్ పై దృష్టి సారించిన పోలీసులు కూర్గ్ వద్ద అరెస్ట్ చేశారు. కల్‌పేటలోని అదనపు సెషన్స్‌ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఔథా ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేశారు. నౌఫుల్ ను జైలునుంచి విడుదల చేశారు.