ఆమనగల్లు, వెలుగు: ఎన్నికల సందర్భంగా ఆమనగల్లు సర్కిల్ పరిధిలో రూ.87.47 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకొని, బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ భద్యా చౌహాన్ తెలిపారు. ఒక కారు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకొని 11 మందిని బైండోవర్ చేసి, నాలుగు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మద్యం, మత్తు పదార్థాలను అక్రమంగా సప్లై చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
చిన్నంబావి: మండలంలోని దగడపల్లి గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన రూ.4.50 లక్షల విలువైన 48 మద్యం కార్టన్లను పట్టుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్ రవి తెలిపారు. మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. ఆఫీసర్లు దాడులు చేయగా, ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలిపారు. టాస్క్ఫోర్స్ సీఐ కల్యాణ్, వీపనగండ్ల ఎస్ఐ రవిప్రసాద్, అశోక్, అజ్జు పాల్గొన్నారు.