ఎక్సైజ్ సూపరింటెండెంట్​ ప్రభు వినయ్ సస్పెన్షన్​

ఎక్సైజ్  సూపరింటెండెంట్​ ప్రభు వినయ్  సస్పెన్షన్​

హైదరాబాద్ సిటీ/వనపర్తి, వెలుగు: వనపర్తి  జిల్లా ఎక్సైజ్  సూపరింటెండెంట్  ప్రభు వినయ్ ను సస్పెండ్  చేస్తూ ఎక్సైజ్  కమిషనర్  శ్రీధర్  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభు వినయ్ కుమార్  4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్, ఫైళ్లను ఇంటి వద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్  రిజిస్టరులో పుట్టిన తేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్  పొడిగించుకోవడంతో పాటు సీనియారిటీ లిస్టులో అక్రమాలకు పాల్పడడంతో అతడిని సస్పెండ్  చేశారు.

ప్రభు వినయ్ అక్రమాలకు పాల్పడ్డారని బీసీ పొలిటికల్  జేఏసీ  చైర్మన్  రాచాల యుగంధర్  గౌడ్  వనపర్తి కలెక్టర్, ఎక్సైజ్  కమిషనర్, ప్రిన్సిపల్  సెక్రెటరీకి ఫిర్యాదు చేయగా,  అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు అతడిని సస్పెండ్  చేశారు.