హైదరాబాద్ రాయదుర్గంలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నివాసంలో సోదాలపై ఎక్సైజ్ డీసీపీ దశరథ్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం (అక్టోబర్ 27) రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ పాకాల నివాసంలో సోదాలు ముగిశాయని తెలిపారు. కానీ రాజ్ పాకాల సమీప బంధువు ఇంట్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయని.. మరో గంటపాటు ఈ సోదాలు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు. కేసు దర్యాప్తు స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడే దీనిపై ఏం మాట్లాడలేమని.. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అనుమతి లేకుండా విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు గుర్తించామని తెలిపారు. మరోవైపు.. రాజ్ పాకాల ఇంట్లో జరుగుతోన్న సోదాలపై ఆయన తరుఫు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. ఇల్లీగల్‌గా రాజు పాకాల నివాసంలో సోదాలు నిర్వహించారని.. ట్రైస్ పాస్ చేశారని ఆరోపించారు. యజమాని లేనప్పుడు ఇంట్లో చొరబడి అక్రమంగా సోదాలు జరిపారని అన్నారు.
Also Read :- అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అక్రమ సోదాల విషయం డీజీపీ జితేందర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా ఇప్పటివరకు ఏం సీజ్ చేశారో అధికారులు మాకు వివరాలు అందించలేదని అన్నారు. కాగా, జన్వాఢ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.