
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్ పోలీసులు మార్చి నెలలో దూకుడు పెంచి 119 కేజీల గంజాయిని పట్టుకోవడంతోపాటు 30 గ్రాముల ఎండీఎంఏ, 35 గ్రాముల ఓజీ కుష్, 13.5 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్‌శాఖ పనితీరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్‌రెడ్డి అభినందించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంతో చాలా చోట్ల ఎక్సైజ్ అమ్మకాలపై ప్రభావం పడుతుండడంతో ఎసీస్టీఎఫ్, ఎన్‌ఫోర్స్ టీమ్స్వాటిపై దృష్టి పెట్టాయి.
హైదరాబాద్ ఎన్‌ఫోర్స్ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీమ్ నారాయణగూడ మినరల్ వాటర్ గోదాంలో ఢిల్లీ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని నిల్వ చేసిన రూ. 22 లక్షల విదేశీ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మొత్తం నాలుగు ఎస్టీఎఫ్ టీమ్స్మార్చిలో35 కేసుల్లో 80 మందిని అరెస్టు చేసి 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి నెలలో ఎక్సైజ్ టీమ్స్పనితీరుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి కమలాసన్‌రెడ్డి ప్రశంసించారు. మంచి ఫలితాలు సాధిస్తున్న సిబ్బందిని అభినందించారు.