లిక్కర్​లో వాటర్ పర్సంటేజీ ఎంత?..ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ

ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ మధ్య వ్యాట్ విషయంలో వివాదం మరింత ముదురుతున్నది. ఎంత లిక్కర్ అమ్ముతున్నామో.. అంతే వ్యాట్ కడ్తున్నామని ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ చెప్తుంటే.. ఏదో తేడా కొడ్తున్నదని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్​మెంట్ ఆరోపిస్తున్నది. లిక్కర్ తయారీకి ఎంత వాటర్ అవసరం అవుతుంది? డిస్టలరీల్లో వాటర్​ను ఇంకా ఏయే అవసరాలకు ఉపయోగిస్తారు? లిక్కర్​లో వాటర్ పర్సంటేజీ ఎంత? ఈఎన్ఏ ఎంత? అనే వివరాలు తెలుసుకోకుండానే తప్పుడు నిర్ధారణకు వచ్చారని వివరించింది. 

అమ్ముతున్న ప్రతి లిక్కర్ బాటిల్​పై వ్యాట్ ముందే వసూలు అవుతుందని స్పష్టం చేసింది. అవసరమైతే మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామని కూడా నివేదికలో చెప్పినట్టు సమాచారం. ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ అధికారులు ఏదో తప్పు చేసినట్టు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఆరోపించడం సరికాదని నివేదికలో చెప్పినట్టు తెలిసింది.