డిసెంబర్లో మద్యం ప్రియులు చాలా తాగేశారు.. వరంగల్ జిల్లా ఆదాయం ఎంతంటే..

డిసెంబర్లో మద్యం ప్రియులు చాలా తాగేశారు.. వరంగల్ జిల్లా ఆదాయం ఎంతంటే..

న్యూ ఇయర్ సందర్భంగా వైన్ షాపుల వద్ద ఎక్కడ లేని సందడి మొదలైంది. కాటన్ల కొద్ది మందును ముందు ముందే కొనేసి పెట్టేసుకున్నారు మందుబాబులు. న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని వైన్ షాపుల యజమానులు భారీగా మద్యం కొనిపెట్టుకున్నారు. బెవరేజ్ శాఖ నుంచి ఒక్క రోజు భారీగా రిటైల్ గా కొని సిద్ధంగా ఉంచారు. 

డిసెంబర్ 31 వచ్చిందంటే ప్రతి ఏడాది ఈ ఒక్కరోజే ఆబ్కారీ శాఖకు ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే ఈ 2024 డిసెంబర్ 31న ఎంత మద్యం అమ్ముడుపోయిందో ఓ రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది. 

 అయితే డిసెంబర్ 1 నుంచి 30 వరకు వరంగల్ జిల్లాలో మందు బాబులు ఎంత తాగారో లెక్కలు విడుదల చేసింది ఆబ్కారి శాఖ. వరంగల్ జిల్లాలో 2024 డిసెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు మద్యం పై 402 కోట్ల 62 లక్షల ఆదాయం   వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఒక్క నెలలో 3లక్షల 82 వేల 265 కేసుల లిక్కర్,  3లక్షల 96 వేల 114 కేసుల బీర్ అమ్ముడు పోయినట్లు తెలిపారు. ఇక డిసెంబర్ 31న వచ్చే ఆదాయం భారీగా ఉండనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.