మద్యం నియంత్రణపై ఎక్సైజ్ శాఖ నజర్

‌హైదరాబాద్‌ , వెలుగు: లోకసభ ఎన్నికల సందర్భంగా మద్యం నియంత్రణపై ఎక్సైజ్‌ శాఖ నజర్ పెట్టింది. లిక్కర్‌‌ ప్రవావాన్ని అడ్డుకునేందుకు సన్నద్ధమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో అప్రమత్తమైన శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మద్యం షాపుల్లో అమ్మకాలు, నియోజకవర్గాల్లోని పరిణామాలపై ఆఫీసర్లతో నిఘా పెంచింది. ఇందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున నోడల్ ఆఫీసర్లను నియమించింది. వీరి ద్వారా ఆయా లోకసభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌ లలో నిరంతం జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించనున్నారు. వీరికి సాయంగా అసిస్టెంట్​ నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ హైదరాబాద్ ప్రొహిబిషన్​అండ్ ఎక్సైజ్​ డీసీ వివేకానందారెడ్డి ఇటీవలే ఉత్తర్వు లు కూడా జారీ చేశారు. హైదరాబాద్‌‌కు శ్రీనివాస్‌ రెడ్డి, సికింద్రాబాద్‌‌కు దత్తురాజ్‌ లు నియమితులయ్యా రు. అలాగే వీరికి సాయంగా ఎక్సైజ్​ సీఐలను అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్లుగా నియమిం చారు. ఇలా 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కో ఆఫీసర్‌‌ను నియమించింది ఎక్సైజ్‌ శాఖ. ఈ ఆఫీసర్లంతా నియోజకవర్గాల్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. క్షేత్రస్థా యిలో తనిఖీలు చేస్తారు. ఆయా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎక్సైజ్​ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గా ల్లో ని మద్యం షాపులపై నిఘా పెట్టనున్నా రు. ఆయా షాపుల్లో గతేడాది మద్యం అమ్మకాలు.. ప్రస్తుత అమ్మకాల్లో ని వ్యత్యాసా లను పరిశీలిస్తున్నా రు. ఈ క్రమంలో గతంలో కంటే ఈసారి 50 శాతం అమ్మకాలు పెరిగిన షాపులుం టే వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.

సమాచరం ఇస్తే 3 గంటల్లో చర్యలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు,నాయకులు ఎవరైనా మద్యం పంపిణీ, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్​అండ్ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌‌ వివేకానందరెడ్డి తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరిస్తే సమాచారం అందించేం దుకు నాం పల్లిలోని ఎక్సైజ్‌ కమిషనరేట్‌ లో ప్రత్యేక కంట్రోల్‌‌ రూం ఏర్పాటు చేశామన్నారు. ఇది 24 గంటలు పనిచేస్తుందన్నా రు. సమాచారం ఇస్తే 3గంటల్లో పే చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిం చామన్నారు. ఇందుకోసం 040-24746884 ఫోన్‌ చేయవచ్చన్నారు.