డ్రగ్స్, గంజాయి​ వాడితే దొరుకుడు పక్కా!

డ్రగ్స్, గంజాయి​ వాడితే  దొరుకుడు పక్కా!
  • డిటెక్షన్​ కిట్స్​ సమకూర్చుకున్న ఎక్సైజ్​శాఖ 
  • ఇప్పటికే వాడుతున్న టీజీ న్యాబ్ 
  • టెస్టులు చేస్తున్న ఎక్సైజ్​శాఖ
  • ఓ పబ్బుతో పాటు ధూల్​పేటలో ప్రయోగాత్మకంగా చెకింగ్​ 
  • సీఎం ఆదేశాలతో డ్రగ్స్​పై ఉక్కుపాదం

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలోని పబ్బులు, క్లబ్బులతో పాటు కొన్ని కాలేజీల్లో స్టూడెంట్స్, యూత్​ డ్రగ్స్​కు బానిసలవుతుండడం, ప్రతిరోజూ ఎక్కడోచోట డ్రగ్స్​పట్టుబడుతుండడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకుంది. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించడంతో కట్టడి చేయడానికి పోలీస్, ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్​శాఖలు కసరత్తు చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో డ్రగ్స్ వాడేవారిని గుర్తించేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. దీనికోసం నార్కోటిక్స్ డిపార్ట్​మెంట్​వాడుతున్న డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చాయి. డ్రంక్ ​అండ్ ​డ్రైవ్  టెస్టుల మాదిరిగానే ఈ డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్​పని చేస్తాయి. ఇవి 13 రకాల డ్రగ్స్​ను గుర్తిస్తాయి.  ఏ రకం డ్రగ్ తీసుకున్నా కూడా గుర్తు పడతాయి. 

ఎలా పని చేస్తుంది? 

అందరికంటే ముందు నార్కోటిక్స్​లోని టీజీ న్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ కిట్స్​ను వాడడం మొదలుపెట్టింది. తర్వాత ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఈ కిట్స్​ను ఉపయోగించి ధూల్​పేటలోని గంజాయి వినియోగదారులపై ప్రయోగాత్మకంగా టెస్టులు చేసింది. కొద్ది రోజుల కింద ఓ పబ్బుతో పాటు ధూల్​పేటలో కొందరి శాంపిల్స్​ సేకరించి పరీక్షించింది. పబ్బులో 65 మంది, ధూల్​పేటలో 15 మందిని టెస్ట్​ చేయగా అందరికీ నెగటివ్​ వచ్చింది.

ముందుగా డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న వ్యక్తి యూరిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాప్​ను ఈ కిట్​పై వేయాలి. రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లోనే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ డ్రగ్​తీసుకుంటే అది ఏ రకం? ఎంత మోతాదులో వాడారో కోడ్​ను బట్టి తెలిసిపోతుంది. టెస్ట్ చేసిన వ్యక్తి వారం రోజుల్లో ఎప్పుడు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నది కూడా బయటపడుతుంది. 

కిట్​ గుర్తించే 13 రకాల డ్రగ్స్ ​..  
 

కోడ్  –  డ్రగ్​రకం ​
 

సీఓసీ- కొకైన్ 

ఏంపీ - ఎంఫెటమైన్ 
ఎంఈటీ–  మెథంఫెటమైన్​
టీహెచ్ సీ - మరిజునా (గాంజా)
ఎంటీడీ – మెథడోన్ఎండీ
ఎండీఎంఏ - మిథైలెనెడియోక్సీ మెథాంఫెటమైన్​ 
ఎంఓపీ - మార్ఫిన్ 
ఓపీఐ - ఓపియడ్స్
పీసీపీ - ఫెన్సీక్లిడైన్
బార్ - బార్బిట్యురేట్స్
బీజెడ్ఓ - బెంజోడియాజిపైన్ 
టీసీఏ- ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్


రాష్ట్రాన్ని డ్రగ్ ​ఫ్రీ సిటీగా మారుస్తాం

 ఇప్పటికే టీజీ న్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వినియోగిస్తోంది. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాఖ కూడా ఈ మధ్య ఓ పబ్​తో పాటు, ధూల్​పేటలో ఈ కిట్స్​ను పరిశీలించి చూసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మా యాక్షన్స్​తో డ్రగ్స్​ అమ్మేవారు,కొనేవారు, వాడేవారు భయపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్​ ఫ్రీ సిటీగా మారుస్తాం.
   – వీబీ కమలాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌