- రేపటితో ముగియనున్న తొలి విడత
హైదరాబాద్, వెలుగు : ధూల్‌పేట్‌లో ఆపరేషన్ గంజాయి మొదటి విడత -రేపటితో ముగియనుందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్, ఎస్‌టీఎఫ్, ఇతర టీమ్‌ల పనితీరుపై గురువారం సమీక్షించారు. మొదటి దశ తనిఖీలతో పూర్తిగా ధూల్‌పేట్ కంట్రోల్‌కు వచ్చిందన్నారు.
కేసులు పెట్టడం, జైళ్లకు పంపడంతో పాటు గంజాయి అమ్మకదార్లలో పరివర్తన వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ శాస్త్రీ, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
21 కిలోల గంజాయి సీజ్
మెహిదీపట్నం: ధూల్‌పేట్‌లో 21 కిలోల గంజాయి పట్టుబడింది. మంగళ హాట్ సీఐ మహేశ్ కథనం ప్రకారం.. ధూల్‌పేట్‌లోని అభిషేక్ సింగ్ ఇంటికి ఒడిశాకు చెందిన మిలన్ దేబ్‌నాథ్ 21 కిలోల గంజాయిని తీసుకొని వచ్చాడు. విశ్వసనీయ సమాచారంతో నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిని విచారించగా, దందాలో మొత్తం ఆరుగురు ఉన్నట్లు అంగీకరించారు. పరారీలో ఉన్న గోరు సింగ్, మున్నా, దీరన్, జయదేవ్ గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.