ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ కేసుల కన్విక్షన్ రేటింగ్‌‌‌‌లో తెలంగాణ ముందంజ : వి.బి.కమలాసన్ రెడ్డి

ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌ కేసుల కన్విక్షన్ రేటింగ్‌‌‌‌లో తెలంగాణ ముందంజ : వి.బి.కమలాసన్ రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎన్ డీపీఎస్ కేసుల కన్విక్షన్ రేటింగ్ లో తెలంగాణ ముందంజలో ఉందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. గతేడాది కన్విక్షన్ రేటు 3 శాతం ఉంటే ప్రస్తుతం అది 5శాతానికి పెరిగిందన్నారు. సోమవారం ఆబ్కారీ భవన్ లో జరిగిన సమావేశంలో డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురికి క్యాష్‌‌‌‌ రివార్డులు అందజేశారు. అనంతరం కమలాసన్​రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌‌‌‌ను పట్టుకోవడమే కాదని నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. 

క్యాష్‌‌‌‌ అవార్డులను అందుకున్న వారిలో కొత్తగూడెం డీటీఎఫ్ సీఐ కరంచంద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ సీఐ కె. నాగేశ్వర్‌‌‌‌రావు, జగిత్యాల ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ సర్వేశ్‌‌‌‌, అలేరు ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌ఓ దీపిక, జూనియర్‌‌‌‌ అసిస్టెంట్ సృజన ఉన్నారు. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్‌‌‌‌తోపాటు జాయింట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్‌‌‌‌ ప్రణవి పాల్గొన్నారు.