కేఫ్‍లో విస్కీ ఐస్​క్రీమ్! జూబ్లీహిల్స్​లోని పార్లర్​లో పట్టుకున్న అధికారులు

కేఫ్‍లో విస్కీ ఐస్​క్రీమ్! జూబ్లీహిల్స్​లోని పార్లర్​లో పట్టుకున్న అధికారులు
  • కిలో ఐస్​క్రీమ్​లో 60 ఎంఎల్ విస్కీ మిక్స్ 
  • కేజీ రూ. 1,700కు అమ్మకం 
  • ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • 11.5 కిలోల ఐస్​క్రీమ్ స్వాధీనం
  • సోషల్ మీడియాలో విస్కీ ఐస్ క్రీమ్​కు క్రేజ్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: పెద్దలతోపాటు చిన్న పిల్లలను సైతం లిక్కర్ మత్తులోకి దించుతున్న ఐస్​క్రీమ్‌‌‌‌‌‌‌‌ పార్లర్ గుట్టురట్టయింది. విస్కీ మిక్స్ చేసిన ఐస్​క్రీమ్​ను పిల్లలకు అమ్ముతూ అక్రమ దందా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని అరికో కేఫ్‌‌‌‌‌‌‌‌ పార్లర్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా సాగుతున్న ఈ విస్కీ ఐస్​క్రీమ్‌‌‌‌‌‌‌‌  దందా వివరాలను ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జాయింట్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఖురేషీ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. 

హైదరాబాద్ కు చెందిన శరత్‌‌‌‌‌‌‌‌ చంద్రారెడ్డి, దయాకర్ రెడ్డి, శోభన్‌‌‌‌‌‌‌‌ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్1, 5లో అరికో కేఫ్‌‌‌‌‌‌‌‌ పేరుతో ఐస్​క్రీమ్‌‌‌‌‌‌‌‌ పార్లర్లు నిర్వహిస్తున్నారు.పార్లర్‌‌‌‌‌‌‌‌లోనే వివిధ రకాల ఫ్లేవర్స్‌‌‌‌తో ఐస్‌‌‌‌ క్రీమ్స్‌‌‌‌ తయారు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. అన్ని రకాల ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్ లు తయారు చేయడంతోపాటు తక్కువ మోతాదులో ఆల్కహాల్ ను కలిపి విస్కీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లు కూడా తయారు చేస్తున్నారు. వీటికి నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ల పేర్లు పెట్టి అమ్ముతున్నారు. కస్టమర్లను అట్రాక్ట్‌‌‌‌ చేసేందుకు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు.  

కిలో ఐస్‌‌‌‌ క్రీమ్‌‌‌‌లో 60 ఎంఎల్‌‌‌‌ విస్కీ

చిన్నారులు సహా ఐస్ క్రీమ్ ప్రియులను ఆకర్షించేందుకు వీరు ఐస్ క్రీమ్‌‌‌‌లో100 పైపర్స్ విస్కీని మిక్స్‌‌‌‌ చేస్తున్నారు. కిలో ఐస్‌‌‌‌ క్రీమ్‌‌‌‌లో 60 ఎంఎల్‌‌‌‌ విస్కీ కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన ఐస్‌‌‌‌ క్రీమ్‌‌‌‌ను రూ.1,700కు కిలో చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు తక్కువ క్వాంటిటీల్లో రిటైల్‌‌‌‌గా కూడా అమ్ముతున్నారు. అయితే, ఐస్‌‌‌‌ క్రీమ్‌‌‌‌లో ఆల్కహాల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ఉందనే విషయం కూడా గుర్తించలేని విధంగా తయారు చేస్తున్నారు. 

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఈ ఐస్‌‌‌‌క్రీమ్స్‌‌‌‌ గురించి ప్రచారం చేస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్లు తీసుకుని, డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు స్పెషల్ ఆఫర్లు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దందా గురించి సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు శుక్రవారం ఉదయం ఏకకాలంలో రెండు పార్లర్లపై దాడులు చేశారు. నిర్వాహకులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 23 విస్కీ ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ పీసెస్‌‌‌‌తో పాటు11.5 కిలోల ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌ను సీజ్ చేసి, శాంపిల్స్‌‌‌‌ను టెస్టుల కోసం ల్యాబ్‌‌‌‌కు పంపించారు.