జోగిపేటలో రూ.1.8లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

జోగిపేటలో రూ.1.8లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం

జోగిపేట,వెలుగు: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సంఘటన ఆలస్యంగా తెలిసింది. మెదక్​ ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు మంగళవారం జోగిపేట శివారులో డాకూర్​ వెళ్లే దారిలో నేషనల్​ హైవేపై తనిఖీ చేస్తుండగా బైక్​పై తరలిస్తున్న  3 కిలోల ఎండు గంజాయి పట్టుకున్నట్లు ప్రోహిబిషన్​ అసిస్టెంట్​ కమీషనర్​ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

 వట్​పల్లి మండలం గౌతాపూర్​ గ్రామానికి చెందిన మోయిద్దీన్​ బైక్​పై అక్రమంగా ఎండు గంజాయి తరలిస్తుండగా   సమాచారం తో  తనిఖీ నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు.  దీని రూ. 1.8 లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.