దాబాలపై ఎక్సైజ్ ​ఎన్​ఫోర్స్​మెంట్ దాడి

దాబాలపై ఎక్సైజ్ ​ఎన్​ఫోర్స్​మెంట్ దాడి
  • 2 కిలోల 428 గ్రాముల ఓపియం ముడిపదార్థం స్వాధీనం
  • ఇద్దరిపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్

వెల్దుర్తి, వెలుగు : మెదక్​జిల్లాలో నేషనల్​హైవే -–44 పైన రెండు దాబాలపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. 2 కిలోల 428 గ్రాముల హెరాయిన్​తయారీకి వాడే ఓపియం ముడి పదార్థాన్ని  స్వాధీనం చేసుకుని దాబాల ఓనర్లపై కేసులు నమోదె చేశారు. సంగారెడ్డి సీఐ వీణారెడ్డి తెలిపిన ప్రకారం..  హైవే – 44పై మాసాయిపేటలో షేర్ పంజాబీ దాబాలో గురువారం  తనిఖీలు చేసి 128 గ్రాముల ఓపియం ముడి పదార్థాన్ని స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేశారు.

అదేవిధంగా బుధవారం సాయంత్రం మనోహరాబాద్ మండలం కాళ్లకల్​లోని దీపక్ దాబాలో 2 కిలోల 300 గ్రాముల ఓపియం దొరికింది. ఓనర్ రవీందర్ సింగ్ పై ఎన్డీపీఎస్​యాక్ట్ కింద కేసు నమో దు చేసి అదుపులోకి తీసుకుని రామాయంపేట ఎక్సైజ్ సర్కిల్  పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ లో పండించే ఓపియం పంట చిన్నకాయలుగా ఉంటుందని, దాంట్లో నుంచి ముడి పదార్థం తయారు చేసి అమ్మకాలు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. 

దాబా యజమానులు మత్తు పదార్థాల అమ్మకాలు బంద్ చేయాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. ఎస్ఐ అనిల్,  హెడ్ కానిస్టేబుల్ ఆజం, కానిస్టేబుల్ ఉమారాణి ఉన్నారు.