- 20 శాతమే కొన్నరు.. 80 శాతం మందు
- ఇండ్లనుంచే తెచ్చిన్రు
మేడారం నెట్వర్క్, వెలుగు: గద్దెలపై కొలువుదీరిన సమ్మక్కసారక్కలను దర్శించుకునేందుకు మూడోరోజు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూసి మరీ అమ్మలకు మొక్కులు అప్పజెప్పారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, నేరుగా దర్శనానికి వచ్చారు. ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, సారె, చీరెలు సమర్పించి, పిల్లాజెల్లా, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు. శుక్రవారం ఏకంగా 50 లక్షల మంది భక్తులు రావడంతో గద్దెల వద్ద తీవ్ర రద్దీ నెలకొన్నది. ఈ క్రమంలో మేడారం జాతరలో భక్తులు దాదాపు రూ.20 కోట్ల లిక్కర్ తాగినట్టు అంచనా.
ఈనెల 19 నుంచి మేడారంలో అబ్కారీ శాఖ అఫిషియల్‍గా 22 వైన్ షాపులు ఓపెన్ చేయగా..అన్ అఫిషియల్‍గా వేలాది బెల్ట్‌షాపులు వెలిశాయి. జాతర మొదలైనప్పటి నుంచి వైన్స్ద్వారా రూ.3 కోట్ల మద్యం అమ్మినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెబుతుండగా, ఈ లెక్క రూ.20 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. జాతరలో లిక్కర్ రేటు డబుల్ చేసి అమ్ముతారని, కల్తీ చేస్తారని 80 నుంచి 90 శాతం మంది ఇండ్లనుంచే బాటిళ్లు తెచ్చు కున్నారు.10 శాతం మంది మాత్రమే లోకల్‍గా కొనగా..మరో 10 శాతం మంది తెచ్చుకున్నది చాలక అప్పటిక ప్పుడు క్వార్టరో, బీరో కొనుక్కున్నారు.