స్కూల్‌‌‌‌ బస్సులో మద్యం సీసాలు

స్కూల్‌‌‌‌ బస్సులో మద్యం సీసాలు
  •     ఇలా పట్టుకొని అలా వదిలేసిన ఎక్సైజ్‌‌‌‌ ఆఫీసర్లు
  •     సిండికేట్‌‌‌‌ వ్యాపారుల జోక్యం వల్లేనని ఆరోపణలు

కామేపల్లి, వెలుగు : ఓ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌ బస్సులో లిక్కర్‌‌‌‌ తరలిస్తుండగా ఎక్సైజ్‌‌‌‌ ఆఫీసర్లు పట్టుకున్నారు. కానీ ఎవరిపైనా ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వదిలేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌కి చెందిన బస్సు స్టూడెంట్లను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తోంది. బస్సులో లిక్కర్‌‌‌‌ సీసాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందడంతో కారేపల్లి  ఎక్సైజ్‌‌‌‌ సిబ్బంది బస్సు ఆపి తనిఖీ చేయగా ఐదు క్వార్టర్‌‌‌‌ సీసాలు దొరికాయి. అయినా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. 

స్కూల్‌‌‌‌ యాజమాన్యం సిండికేట్‌‌‌‌ వ్యాపారులను రంగంలోకి దించడం, వారు ఎక్సైజ్‌‌‌‌ సిబ్బందిని మేనేజ్‌‌‌‌ చేయడం వల్లే వారు చూసీచూడనట్లు వెళ్లిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ను వివరణ కోరగా తమ స్కూల్‌‌‌‌లో పనిచేసే ఓ వ్యక్తి తమకు తెలియకుండా మద్యం కొని బస్సులో తీసుకెళ్తున్నట్లు తెలిసిందన్నారు. కారేపల్లి ఎక్సైజ్‌‌‌‌ ఎస్సై వసంత వివరణ కోరగా వినియోగ పరిమాణంలో ఉన్న మద్యాన్ని మాత్రమే గుర్తించామని, ఎవరిపైనా ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని చెప్పారు. అయితే స్కూల్‌‌‌‌ బస్సులో లిక్కర్‌‌‌‌ సీసాలు దొరికినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.