143 లీటర్ల కల్తీకల్లు ధ్వంసం

ఆదిలాబాద్, వెలుగు: కల్తీ కల్లు విక్రయిస్తున్న దుకాణాలపై శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. తలమడుగు మండలంలోని తలమడుగు, ఝరి, కుచులాపూర్, ఉమ్రి,  ఆదిలాబాద్ మండలంలోని అంకోలి, తంతోలి, లోకారి గ్రామాల్లో దాడులు చేపట్టారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి, 143 లీటర్ల కల్లును ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ విజేందర్ తెలిపారు.

అక్రమ మద్యం పట్టివేత

కడెం, వెలుగు: మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ లోని శ్రీనివాస్ కిరాణా షాపులో కడెం పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 32 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.