ఇన్‌‌‌‌స్టాగ్రాంలో మెసేజ్ చేస్తే గంజాయి సప్లై

  • నిందితుడిని అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్​స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే గంజాయి,  డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్​ చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గురువారం నిజాంపేట్ కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. 

ఓ యువకుడి బ్యాగులో చెక్​చేయగా 17.07 ఓజీ కుష్ గంజాయి, 2.34. గ్రాముల ఎండీఎంఏ, రెండు ఎల్ఎస్డి బ్లాస్ట్, 220 గ్రాముల ఎండు గంజాయి దొరికింది. వీటి విలువ రూ.1.40 లక్షలు ఉంటుందని ఎక్సైజ్​ సీఐ నాగరాజు తెలిపారు. నిందితుడు లీలాకృష్ణ  గోవా అంజనా బీచ్ లో ఓ డ్రగ్స్ వ్యాపారి వద్ద ఈ డ్రగ్స్​ కొని హైదరాబాద్​కు తీసుకువచ్చి ఇక్కడ ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అమ్ముతున్నాడు. నిందితుడు గతంలో డ్రగ్స్ కేసుల్లో మూడు సార్లు జైలుకు వెళ్లి వచ్చినా మార్పు రాలేదని తెలిపారు.