గ్రేటర్ లోని 25 పబ్బులపై ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బులు, బార్ లలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 25పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో అనుమానితులకు పరీక్షలు చేశారు.

 వీకెండ్ ఎంజాయ్ మెంట్ పేరుతో పబ్బుల్లో యువత, ఉద్యోగులు టార్గెట్ గా సెర్చింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎవరికీ డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రాలేదన్నారు. తనిఖీల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్,DTF,STF బృందాలు పాల్గొన్నాయి.