- గోవా నుంచి తెస్తూ ఎయిర్‌పోర్టు బయట పట్టుబడ్డ యువకులు
- ఏడుగురు అరెస్ట్.. 415 లిక్కర్బాటిల్స్ స్వాధీనం
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి అమ్మకందార్లతోపాటు కొత్తగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలకు కొందరు అక్రమార్కులు తెర లేపారు. గోవా నుంచి విమానాల్లో మద్యం బాటిళ్లను తీసుకువస్తూ శంషాబాద్ విమానాశ్రయం బయట ఎక్సైజ్పోలీసులకు దొరికారు. ఇందులో కొంతమంది తాగడానికి తెచ్చుకున్న వారు కాగా, మిగతా వారు బిజినెస్చేయడానికి పట్టుకువచ్చినవారు ఉన్నారు. పక్కా సమాచారం మేరకు విమానాశ్రయం బయట ఎక్సైజ్‌పోలీసులు తనిఖీ చేయగా ఏడుగురు తలా 30 బాటిల్స్‌తో వచ్చి పట్టుబడ్డారు.
మరో 90 మంది ఒకటి, రెండు బాటిల్స్‌తో రాగా వాటిని స్వాధీనం చేసుకుని హెచ్చరించి వదిలేశారు. మొత్తంగా రూ.12 లక్షల విలువైన 415 బాటిల్స్ ను సీజ్‌చేశారు. అలాగే ముషీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మెట్రో స్టేషన్దగ్గర ఒక కారులోంచి మరో కారులోకి రూ. 3.85 లక్షల విలువ చేసే 72 మద్యం బాటిల్స్ మారుస్తుండగా పట్టుకున్నారు. ఎంక్వైరీ చేయగా అత్తాపూర్‌కు చెందిన గోపాల్ అగర్వాల్చంఢీగడ్నుంచి కారులో మద్యాన్ని తీసుకువచ్చినట్టు చెప్పాడు. సీఐని హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి అభినందించారు.