సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ సర్కార్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి ఆరోపణల కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ పేరు ప్రధాన కుట్రదారులలో ఒకరిగా బయటపడిందని, దర్యాప్తు ఇంకా పురోగతిలో ఉన్నందున, తదుపరి కస్టడీ విచారణకు అనుమతివ్వాలని అధికారులు కోరారు. దీంతో న్యాయస్థానం కేజ్రీవాల్ కు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. దీన్ని సవాల్ సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

Also Read:అమల్లోకి మూడు కొత్త చట్టాలు.. మొదటి కేసు నమోదు

కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫారసు చేయడంతో జూలై 2022లో కేజ్రీవాల్ ప్రభుత్వం పాలసీని ఉపసంహరించుకుంది.