ఆర్టీసీ బస్సులో సీటు కింద భారీగా సెల్ ఫోన్లు స్వాధీనం..అన్నీ బ్రాండెడ్ సెల్ ఫోన్లే.. ఖరీదైన ఫోన్లే..కావాలని వదిలి వెళ్లారా..లేక మరిచి పోయి వెళ్లారా.. అక్రమంగా తరలిస్తూ తనిఖీ దొరికిపోతామని వదిలివెళ్లారా తెలియదుగానీ.. వాటికి సంబంధించి ఆధార పత్రాలు లేవు..కేరళ పోలీసు చరిత్రలో ఇంతపెద్దమొత్తంలో అత్యంత ఖరీదైన సెల్ ఫోన్లు పట్టుబడటం ఇదే తొలిసారి.కేరళలోని కోజికోడ్ ఆర్టీసీ బస్సులో దొరికిన విలువైన సెల్ ఫోన్లను అక్కడి ఎక్సైజ్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు..వివరాల్లోకి వెళితే..
ముతుంగ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేస్తుండగా.. మైసూర్ నుంచి కోజికోడ్ వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ లో బస్సులో ఖరీదైన 75 సెల్ ఫోన్లు దాచిఉంచిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో ఉంచి సీటు కింద పెట్టి వెళ్లారు. వీటికి సంబంధించి ఎలాంటి ధృవ పత్రాలు లేవు.
ఇంత పెద్ద మొత్తం సెల్ ఫోన్లు తనిఖీల్లో పట్టుబడటం ఇదే తొలిసారి అంటున్నారు కేరళ పోలీసులు. ఈ సెల్ ఫోన్లు దొంగిలించి అక్రమంగా తరలిస్తున్నవి అయినా అయి ఉందడాలి లేదా.. లెక్క చెప్పలేని అక్రమ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు వదిలివెళ్లిన అయినా అయి ఉండాలి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సెల్ ఫోన్లను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కోసం ఉపయోగించేందుకు తీవ్రవాద, ఉగ్రవాదగ్రూపులు ఏమైనా సోర్స్ చేశాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు.