చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ ఇన్నర్ వ్యూ విశేషంగా ఆకట్టుకుంటున్నది. టెర్మినల్‌ను ఆదివారం ప్రారంభించగా, వర్షం పడినా తడవకుండా ఒక ప్లాట్ఫారం నుంచి మరో ప్లాట్ఫారానికి వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన రూప్ టాప్ అబ్బురపరుస్తున్నది. వెయిటింగ్ హాళ్లు, బేబీ ఫీడింగ్ సెంటర్లు, 9 ప్లాట్‌ఫారాలకు ఒక వైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఇలా ఎటుచూసినా అత్యాధునిక హంగులతో దర్శనమిస్తున్నది. రైల్వే స్టేషన్ ఎదుట వాహనాలు డ్రాప్, పికప్కోసం విశాలమైన ఏరియా ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తున్నది.
ఫొటోగ్రాఫర్, వెలుగు