జస్టిస్​ నర్సింహారెడ్డి రియాక్షన్​పై ఉత్కంఠ

జస్టిస్​ నర్సింహారెడ్డి రియాక్షన్​పై ఉత్కంఠ
  • ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణే అక్కర్లేదన్న కేసీఆర్
  • ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుతున్న కమిషన్  
  • కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ.. 

చత్తీస్​గఢ్​తో చేసుకున్న విద్యుత్​కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదించిందని ఇటీవల కమిషన్ కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై న్యాయ విచారణ అవసరమే లేదని, కమిషన్​ చైర్మన్​కి విచారణార్హత లేనందున ఆయన తప్పుకోవాలని ఎదురుదాడి చేశారు. దీంతో కేసీఆర్​ లెటర్​పై కమిషన్ చైర్మన్ జస్టిస్​ నర్సింహారెడ్డి సమీక్ష జరుపుతున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులతోనూ మాట్లాడుతున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికిఈఆర్సీ ఆమోదం లభించలేదని రఘు చెప్పడంతో ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.