ఆర్టీసీ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ.. అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం..

ఆర్టీసీ బిల్లు ఆమోదంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాల సమావేశాల్లో నే RTC బిల్లును ఆమోదించేందుకు అసెంబ్లీ సమావేశాలను మరో కొన్ని రోజులు పొడగించాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.  మూడు రోజుల సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ఆమోదించాలనుకున్నా గవర్నర్ తమిళిసై అభ్యంతరం తెలిపింది. ఈ బిల్లుపై రెండుసార్లు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనికి ప్రభుత్వం ఒక్కసారి రిప్లై ఇచ్చింది. బీఏసీ సమావేశంలో మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినా.. అవసరమైతే సభా సమయాన్ని పొడిగిస్తామని  రాష్ట్రప్రభుత్వం తెలిపింది.