
పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రుల గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కొడుకు కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందడంతో ఆ పేదింటి తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. యూనిఫాంలో కొడుకును చూసేందుకు వచ్చారు. పరేడ్ పూర్తికాగానే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి తన టోపీని వారి తలకు పెట్టి సెల్యూట్ చేశాడో కానిస్టేబుల్.. ఆ క్షణం తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం తాండవించింది. మరో కానిస్టేబుల్ అభ్యర్థి తల్లి తలపై తన క్యాప్ పెట్టాడు.. తన చేతిలోని 303 రైఫిల్‌ను తండ్రికి అందించి మైదానంలోనే పాదాభివందనం చేశాడు. ఈ ఉద్వేగభరిత దృశ్యాలను చూసిన పలువురు ఆనంద భాష్పాలు రాల్చారు.. ఈ దృశ్యాలు ఇవాళ జరిగిన పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో కనిపించాయి.