
మ్యాడ్’ చిత్రాన్ని మించిన కామెడీ ‘మ్యాడ్ స్క్వేర్’లో ఉంటుందని మ్యాడ్ బాయ్స్ చెప్పారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోలు చిత్ర విశేషాలను పంచుకున్నారు.
నార్నె నితిన్ మాట్లాడుతూ‘‘మ్యాడ్’లో కాస్త సీరియస్‌గా ఉండి చివరికి కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తా. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నా. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించకండి, సరదాగా నవ్వుకోవడానికి థియేటర్స్‌కి రావాలి’ అని చెప్పాడు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ “మ్యాడ్’ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’ను ఆడుతూపాడుతూ చేశాం. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు. ఇందులోని కామెడీ కొత్తగా ఉంటూనే క్లీన్‌గా ఉంటుంది. వంశీ గారు చెప్పినట్టు పెళ్లి సీక్వెన్స్ అందరికీ నచ్చుతుంది’ అని అన్నాడు.
రామ్ నితిన్ మాట్లాడుతూ ‘వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. గత చిత్రంతో పోల్చితే ఇందులో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ విషయంలో ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం ఉండేది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా చేశాం. దాంతో పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్‌గా వచ్చింది. ఈ మూవీ విషయంలో నాగవంశీ గారి పాత్రే కీలకం. ఆయన దర్శకుడిని, నటీనటులను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. మ్యాడ్ ఫ్రాంచైజ్‌ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కానీ, వెంటనే కాకుండా కాస్త విరామం ఇచ్చి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం’ అని చెప్పాడు.