బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్

బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్

దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. యూపీ సహా పలు ప్రాంతాల్లో బుల్డోజర్ల కూల్చివేతల విషయంలో పిటిషన్లపై నవంబర్ 13న (ఈరోజు) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పిటిషన్లపై వాదనల సందర్భంగా ధర్మాసనం.. అధికారులు న్యాయ నిర్మేతలు కారు. 

కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ చట్టాన్ని, అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కార్యనిర్వాహక వర్గం, అధికారులు చట్టవిరుద్ధంగా ఆస్తులను నిర్ధారించి కూల్చివేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పింది. నిందితులపై ఎలాంటి చర్యకైనా ముందు న్యాయమైన విచారణ జరగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారులు ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించడం తగదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది.

Also Read :- నాగారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు

నిందితుల ఇళ్లను బుల్డజర్లతో కూల్చడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్‌ యాక్షన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. సరైన విధానం పాటించకుండా ఇల్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధం. 

కూల్చివేతలకు 15 రోజుల ముందస్తు నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలి. నోటీసులను మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్‌లో ఉంచాలి. కూల్చివేతలు తప్పనిసరి అయితే దానికి తగిన కారణాలు చెప్పాలి. నోటీసులను తప్పనిసరిగా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలి.  కూల్చివేతలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. అధికారుల జీతం నుంచి జరిమానాలు వసూలు చేస్తాము’ అంటూ వార్నింగ్‌ ఇచ్చింది.