
ఎయిర్ పోర్టుల సమర్థ నిర్వహణలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలిపి వీరు రూ.13 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: బీఎస్సీ ఫిజిక్స్, ఏదైనా విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 27 సంవత్సరాలు మించకూడదు. నెలకు రూ.40,000 – -1,40,000 జీతం చెల్లిస్తారు.
సెలెక్షన్: ఆన్‌లైన్ పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.aai.aero వెబ్సైట్లో సంప్రదించాలి.